తెలంగాణ

మతిభ్రమించింది నీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, మే 17: నాకు మతిభ్రమించిందన్న నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికే సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వక, చివరకు ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వకుండా ఇచ్చిన షాక్‌తో మతిభ్రమించిందని దీంతో తనను తిడితేనన్న కేసీఆర్ ఏదో పదవి ఇస్తారన్న భ్రమలతో ఆయన తనపై విమర్శలు చేస్తున్నాడని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం కనగల్ మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే మూడు పార్టీలు మారాడని, ఇక మీదట వార్డు మెంబర్‌గా కూడా గెలువబోడని, దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని, ఎంపీగా తన పదవీ కాలంలో జిల్లాలోని పరిశ్రమల నుండి, దుకాణదారులు, ఉద్యోగస్తుల నుండి వసూళ్లకు పాల్పడి, కోట్లాది రూపాయల అక్రమార్జన చేసి రాష్ట్రంలో పలుచోట్ల ఇళ్లు, భూములు, ఆస్తులు కూడబెట్టుకొన్నాడన్నారు. జిల్లాలో 30 కోట్లతో ఇళ్లు కట్టుకున్నాడన్నారు. పిల్లికి భిక్షం పెట్టని గుత్తా ఆయన అవినీతి చరిత్రను మరిచి, అడగకుండానే నియోజకవర్గ ప్రజలకు లక్షల రూపాయల సహాయం అందిస్తూ విద్య, వైద్య సేవలను ట్రస్టు ద్వారా అందిస్తున్న తనను విమర్శించే అర్హత ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
మదర్ డెయిరీని అడ్డుపెట్టుకుని గుత్తా సోదరులు ఏటా రెండు లక్షల లీటర్ల పాలకు రెండులక్షల లీటర్ల నీళ్లు పోసి ఏటా చెరో 50లక్షలు దోచుకుంటూ రైతుల, పశువుల రక్తం తాగుతున్నారన్నారు. ఎవరైనా తిరుపతికి సిఫారసు లెటర్ రాసివ్వమన్నా డబ్బులు ఆశించే నీచ సంస్కృతి గుత్తాదని విమర్శించారు. మంత్రి పదవి ఇస్తానని ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్‌ను బెడ్‌రూమ్ లోపల నిత్యం బూతులు తిడుతున్న గుత్తా బయట మాత్రం కేసీఆర్ ప్రాపకం కోసం తనను తిడుతున్నాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. గుత్తా స్వార్ధబుద్ధిని గ్రహించే సీఎం కేసీఆర్ ఆయనకు ఏ పదవీ ఇవ్వకుండా సరైన గుణపాఠం చెప్పారన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తాను సంపాదించిందేమీ లేదని, నల్లగొండలో అదే మోటార్ సైకిల్‌పైన, కారుపైన, అదే అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న తాము పార్టీని కాపాడుకునేందుకు ఎన్నికల్లో వ్యయప్రయాసలు భరించి ఎన్నికలను ఎదుర్కొంటున్నామన్నారు. ఓడినా గెలిచినా ప్రతిపక్షంలో ఉన్న తమకు ఆర్ధికంగా రాజకీయంగా ఒరిగేదేమీ లేదన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి లక్ష్మి ఓడిపోతుందంటు గుత్తా, మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అదే నిజమైతే ఆరుగురు మంత్రులు, పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పెట్టి ముందస్తుగా క్యాంపులు ఎందుకు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనను విమర్శించే సమయంలో గుత్తా పక్కన ఉన్న జడ్పీటీసీలు ఇద్దరు ఓడిపోనున్నారని, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి గుత్తాను సొంతూరుకు కూడా రాకుండా చేస్తానని, గుత్తా తమ్ముడి డెయిరీ చైర్మన్ పదవి ఊడపీకిస్తానంటూ తిరుగుతున్నాడన్నారు. ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి పనితీరును నియోజకవర్గం ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తాను భువనగిరి ఎంపీగా ఓడిపోతానని గుత్తా వ్యాఖ్యానించారని తాను ఓడిపోతే ఇకముందు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయనని, గెలిచినట్టయితే గుత్తా ఆయన తమ్ముడితో మదర్ డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే కేంద్రంలో తాను మంత్రిని కూడా కావచ్చన్నారు. గుత్తా లాగా అవినీతి రాజకీయాలు తనకు చేతకావన్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లా పరిషత్ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలువబోతుందన్నారు. ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారని ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుందన్నారు. ఈ సమావేశంలో కనగల్ కాంగ్రెస్ నాయకులు జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ అభ్యర్ధి భిక్షం తదితరులు పాల్గొన్నారు.