తెలంగాణ

20 నుంచి సెంట్రల్ వర్శిటీ అడ్మిట్ కార్డుల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వివిధ పీజీ కోర్సులు, ఎంఫిల్, పీహెచ్‌డీతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఈ నెల 27 నుండి 31 వరకూ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అడ్మిట్ కార్డులను ఈ నెల 20 నుండి జారీ చేస్తారు. జవాబుపత్రాలను జూన్ 1న పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తామని జూన్ 2 నాటికి పరీక్ష రాసిన వారు ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చని, ఆ సమాచారాన్ని సంబంధిత డీన్‌లకు జూన్ 3 నాటికి పంపిస్తామని, తుది కీలను జూన్ 8న ఖరారు చేసి ర్యాంకులను ప్రకటిస్తామని అధికారులు వివరించారు. ఈసారి వర్శిటీలో ఒబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని, అందుకు సంబంధించిన ధృవపత్రాలను అభ్యర్ధులు వర్శిటీకి పంపించాలని ఇతర వివరాలకు ఏసీఏడీ డాట్ యుఓహెచ్‌వైడీ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ సందర్శించాలని చెప్పారు. ఆర్ధిక శాస్త్రానికి సంబంధించి ఎంఫిల్, పీహెచ్‌డీ పరీక్ష ఒకే రోజు నిర్వహిస్తున్నామని, ఆ సబ్జెక్టుకు దరఖాస్తు చేసిన వారు పీహెచ్‌డీ పరీక్ష రాస్తే వారి దరఖాస్తును ఎంఫిల్‌కు సైతం పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. స్పాన్సార్డ్ సీట్లకు ఆయా అభ్యర్ధులు తమ వివరాలు తెలియజేస్తూ, స్పాన్సార్డ్ లెటర్‌ను జత పరిచి డిప్యుటీ రిజిస్ట్రార్ (అకడమిక్స్ ఎగ్జామ్స్) చిరునామాకు పంపించాలని అన్నారు. ఎంసీఏ కోర్సునకు నిమ్‌సెట్ -2019 స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందిస్తామని అన్నారు. ప్రవేశపరీక్షలను దేశవ్యాప్తంగా 30 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు.