తెలంగాణ

ప్రధాని మోదీ గొప్ప సమైక్యతావాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్న గొప్ప సమైక్యతావాది అని, టైమ్స్ పత్రికల్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక జర్నలిస్టు బురదజల్లేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు నమ్మడం లేదని బీజేపీ మానిఫెస్టో కమిటీ సభ్యురాలు కరుణ గోపాల్ చెప్పారు. శుక్రవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంగ్లాండ్‌లో స్థిరపడిన పాక్‌కు చెందిన అటీష్ టస్సీర్ కేవలం ప్రధాని మోదీ అంటే వ్యతిరేకతతో ఇష్టం వచ్చినట్లు వ్యాసాలు రాశారన్నారు. మతపరమైన ఉద్రిక్తతలు పెంచేందుకు విదేశీ శక్తులు కుట్రపన్నుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఈశాన్య రాష్ట్రాలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాని మోదీ నాయకత్వంలవో ఈశాన్యంలోని ఎనిమిది రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందాయన్నారు. ఈ రోజు ఎనిమిది రాష్ట్రాలు అష్టలక్ష్మిగా పేరు తెచ్చుకున్నాయన్నారు. అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన మోదీ దేశాన్ని సమగ్రంగా నడిపించే బలమైన నేత అన్నారు. దేశంలో వౌలిక సదుపాయాలు సంపూర్ణ్భావృద్ధికి విశేషమైన కృషి చేశారని, భారీ నిధులు కేటాయించారన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్న భారత్‌ను అగౌరవపరచడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నారు. టైమ్ మ్యాగజైన్ భారత్ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె చెప్పారు.