తెలంగాణ

కేసీఆర్ పాలనలోనే దళితులపై లైంగిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, మే 18: స్వరాష్ట్రంలో దళితులపై లైంగిక దాడులు జరుగుతున్న ప్రభుత్వ యత్రాంగం అలసత్వం వహిస్తుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణమాదిగ విమర్శించారు. రాయవరంలో ఓ దళిత మైనర్ బాలికపై ఆత్యాచారం జరిగి 72 గంటలు గడుస్తున్న నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం జేశారు. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని రాయవరంలో లైంగిక దాడికి గురైన బాధిత బాలికను పరామర్శించిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. బాలికపై అత్యాచారం జరిగి మూడు రోజులు గడుస్తున్న నిందితులను అరెస్టు చేయడంలో గజ్వేల్ ఏసీపీ, స్థానిక ఎస్సై, సంఘటనపై విచారణకు స్పందించని ఆర్డీఓ, తహశీల్దార్‌ను వెంటనే సస్పేండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జరిగిన సంఘటనపై ప్రజాసంఘాలు స్పందించే వరకు ప్రభుత్వ అధికార యత్రాంగం నిందుతులపై చర్యలు తీసుకోకపొవటంపై అగ్రహం వ్యక్తం చేశారు. ఒక అనాధ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడితే ఆ కుటుంబాన్ని ఆదుకొవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు. నిందుతులను వెంటనే అరెస్టు చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2016నుండి 17 వరకు 558మంది దళిత బాలురు, 1021 మంది బాలికలు ఆదృశ్యం అయితే ఇంతవరకు రాష్ట్ర పోలీస్‌లు వారి అచూకిని కనుగొనడంలో విఫలం చెందారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి, నిందితులకు శిక్షలు పడేందుకు పాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి దళిత బిడ్డలకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న డాదులపై సీబీఐ చేత విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.