తెలంగాణ

విద్యుత్ చార్జీల భారం లేకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎన్‌టీపీసీతో ఒప్పందం చేసుకుని, విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయకుండా చూడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ స్థాపిత శక్తి తక్కువగా ఉన్నందున ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాలని, కానీ ఎన్‌టీపీసీతో 1600 మెగావాట్లు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో యూనిట్‌కు 3.89 రూపాయిలకు సరఫరా చేస్తోందని, మిగిలిన 2400 మెగావాట్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపకపోవడంతో ఆ పనులు చేపట్టలేదని అన్నారు.
పశ్య రాంరెడ్డి మృతిపై సురవరం సంతాపం
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పశ్య రాంరెడ్డి మరణం పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనేక పోరాటాల్లో రాటుదేలిన రాంరెడ్డి గొప్పనాయకుడని పేర్కొన్నారు.