తెలంగాణ

నైపుణ్యం, వికాసంతోనే రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఏ వృత్తిలోనైనా నైపుణ్యంతోనూ, వికాసంతో మాత్రమే రాణించగలుగుతామని, పేరు సంపాదించుకోవడం చాలా కష్టమని, ఎంతో మంచితనంతో విలువలతో పనిచేస్తేనే పేరు వస్తుందని, అలా పేరు సంపాదించుకున్న తర్వాత డబ్బు సంపాదించడం చాలా తేలిక కావచ్చని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎస్ న్యాయ విద్యాసంస్థ నిర్వహించిన మినీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ విద్యార్థులు వృత్తిని తేలికగా తీసుకోవడానికి వీలు లేదని, అనునిత్యం కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ తమ వృత్తిలో రాణింపునకు కృషి చేయాల్సి ఉంటుందని, అపుడే వారికి న్యాయస్థానాల్లో సైతం విలువ పెరుగుతుందని అన్నారు. ఒక వ్యక్తి గురించి మంచి విషయం పక్కవారికి చేరేలోగా, ఆ వ్యక్తిలోని దుర్గుణాలన్నీ ప్రపంచం చుట్టి వస్తాయని, కనుక సమాజంలో అప్రమత్తంగా ఉండాలని, వృత్తిపరమైన నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని సూచించారు. న్యాయవిద్యలో సైతం ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ న్యాయ విద్యా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ బీ ద్వారకానాథ్ మాట్లాడుతూ న్యాయవిద్యలో అవకాశాలు మెండుగా పెరిగాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. న్యాయవాదిగా రాణించాలంటే ఎన్నో మెళుకువలను అందిపుచ్చుకోవాలని, బహుళజాతి కంపెనీల్లో, నవరత్నాల్లో న్యాయవాదులకు మంచి గిరాకీ ఉందని అన్నారు. ఈసందర్భంగా 2015-18 బ్యాచ్‌కు చెందిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం విద్యార్ధులకు సర్ట్ఫికేట్లు, ప్రతిభాపురస్కారాలను అందించారు. కేడియా విద్యాసంస్థల కమిటీ అధ్యక్షుడు కమల్ నారాయణ్, కార్యదర్శి సురేంద్ర లూనియా, కాలేజీ డైరెక్టర్ డాక్టర్ డీవీజీ కృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎంసీ విజయకుమార్ , సంయుక్త కార్యదర్శి ఎస్‌బీ కాబ్రా, ప్రమోద్ కేడియా, బాలాచంద్ పాల్గొన్నారు.