తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే సర్కార్‌యే అధికారంలోకి రానున్న నేపథ్యంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదామని బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలపై చర్చించడానికి సోమవారం సాయంత్రం బీజేపీ సీనియర్ నేతలు సమావేశమై చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్లమెంట్ అభ్యర్థి డికె అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరై చర్చించారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఒక పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోనుందని దాదాపు అన్ని సంస్థలు వెల్లడించిన అంశంపై చర్చ జరిగింది. ఒకటి కాదు రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని సీనియర్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకంగా మారిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఫలితాల తర్వాత ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. అలాగే మరోవైపు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి నివ్వురుగప్పినా నిప్పులా ఉందన్నారు. ఈ రెండు పార్టీల్లోని అసంతృప్తి నాయకులను బీజేపీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని బలోపేతం చేద్దామన్నారు. పార్టీ రాష్ట్రంలో బలపడాలంటే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చేలా అధిష్ఠానంపై వత్తిడి తీసుకరావాలని సమావేశం నిర్ణయించింది.