తెలంగాణ

మూడు పుస్తకాలను ఆవిష్కరించిన సీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన మూడు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి సోమవారం ఆవిష్కరించారు. ‘మనకు తెలియని తెలంగాణ’ అంశంపై తెలంగాణలోని పురాతన కట్టడాలపై పరిశోధన చేసి యువ పరిశోధకుడు అరవింద్ ఆర్య రాసిన పుస్తకాన్ని సీఎస్ ఆవిష్కరించారు.
అలాగే పెన్నా శివరామకృష్ణ రాసిన ‘తారీఖుల్లో తెలంగాణ’ అనే తెలంగాణ చరిత్ర పుస్తకాన్ని, ‘తెలంగాణ రుచులపై శాఖాహార, మాంసాహార వంటల తయారీపై జ్యోతి వలబోజు రాసిన పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే పరిశోధన చేసి పుస్తకాన్ని రాసిన అరవింద్ ఆర్యను, తెలంగాణ చరిత్రను రాసిన శివరామకృష్ణను, 20 ఏళ్ల నుండి వంటలపై వ్యాసాలు రాస్తూ, పుస్తక రూపం కల్పించిన జ్యోతిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పుస్తకాల రచయితలు పాల్గొన్నారు.

చిత్రం..సచివాలయంలో సోమవారం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన
మూడు పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి