తెలంగాణ

అంబేద్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: పంజాగుట్టలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఆవిష్కరించాలని తెలంగాణ అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. సోమవారం సాయంత్రం వారు గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.
వినతిపత్రంపై మాజీ ఎంపీ టీ వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐఎంఎల్ నేత కే రమ, ఎంసీపీఐయూ కార్యదర్శి తాండ్రకుమార్, ఆర్‌ఎస్‌పీ కార్యదర్శి జానకి రాములు, బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్‌రెడ్డి, సీపీఐఎం కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, జీ రాములు, ఎం శ్రీనివాస్‌లు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన విషయంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని దానిని తిరిగి యథాస్థానంలో ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించాలని అన్నారు.
విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించి దానిని చెత్తలో పడేసిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని వారు కోరారు. అధికారుల తీరు వల్ల అంబేద్కర్‌కు తీరని అవమానం జరిగిందని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో హామీ ఇచ్చారని, అది ఇంత వరకూ నెరవేరలేదని చెప్పారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారనే నెపంతో ఎలాంటి సమాచారం లేకుండా రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం ఎంత వరకూ సమంజసమని వారు ప్రశ్నించారు.
చిత్రం.. పంజాగుట్టలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఆవిష్కరించాలని తెలంగాణ
అఖిలపక్ష పార్టీల నేతలు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేస్తున్న దృశ్యం.