తెలంగాణ

ఇందూర్తి ప్రాజెక్టు కోసం రేకొండ చెరువు నింపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: కరీంనగర్ జిల్లా ఇందూర్తి సీపీడబ్ల్యుఎస్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రేకొండ నుండి వెళ్లే మిషన్ భగీరథ పైపునకు లేదా సుందరగిరి పైపు లైన్‌నుండి లింక్ పెట్టి శాశ్వతంగా నీటి సరఫరా చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. 2003 సంవత్సరం ఇందూర్తి నియోజకవర్గంలో ఫ్లొరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఆనాటి ప్రభుత్వం శాశ్వత మంచినీటి పథకం 35 కోట్లతో మంజూరి చేసిందని, ఎల్‌ఎండి నుండి వరంగల్‌కు వెళ్లే కాకతీయ కెనాల్‌కు పోలంపల్లి వద్ద లిఫ్టు పెట్టి రేకొండరాయిని చెరువుకు సమ్మర్ స్టోరీజీ నిర్ణయించారని అన్నారు. 2004 సంవత్సరంలో పథకం మార్చాలనుకున్నా కుదరలేదని, కాకతీయ కెనాల్‌కు ఎల్‌ఎండీ నుండి 60 రోజులు మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని అన్నారు. దాంతో పూర్తిస్థాయిలో నీటిసరఫరా కాకపోవడం రాయిని చెరువు స్టోరేజీ ట్యాంకు పూర్తిస్థాయిలో నీరు నిండలేదని, అప్పుడు ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేసి ఎల్‌ఎండీలో ఒవెన్‌వెల్ తవ్వించి, అక్కడి నుండి సందరగిరి సెంట్రల్ పాయింట్‌గా పెట్టి రేకొండ రాయిని చెరువుకు నీటిని సరఫరా చేయడానికి, మరోవైపు హుస్నాబాద్, కోహెడ్‌కు కూడా నీటిని సరఫరా చేయడానికి నిర్ణయించారని పేర్కొన్నారు. తాను అనేక సందర్భాల్లో ఆర్‌డబ్ల్యుఎస్ రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం చేకూరలేదని, నేడు కరవు తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. దాదాపు 36 అప్‌టేషన్స్ నీటి సరఫరాకు బదులు ప్రస్తుతం కేవలం నాలుగు అప్‌టేషన్స్‌కు మాత్రమే నీటి సరఫరా అవుతోందని 35 కోట్ల రూపాయిలు వెచ్చించినా, నీటి లభ్యత లేకపోవడం వల్ల అన్నీ ఉండి అల్లుడి నోట్లో శనిలా పరిస్థితి మారిందని పేర్కొన్నారు.