తెలంగాణ

అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న పబ్లిక్ గార్డెన్స్ స్థలాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ సోమవారం పరిశీలించారు. అవతరణ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే నిర్ణయించారు. వేడుకలు నిర్వహించే స్థలం పరిశీలన, మీటింగ్ ఏర్పాట్ల పరిశీలన బాధ్యతను శ్రీనివాస్‌గౌడ్‌కు కేసీఆర్ అప్పగించారు. దాంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఉన్నతాధికారులతో కలిసి పబ్లిక్‌గార్డెన్స్‌ను సందర్శించారు. ఏర్పాట్లు ఎలా చేయాలో సూచించారు. పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లిహాలులో కవిసమ్మేళనం నిర్వహించాలని సూచించారు. మంత్రి వెంట సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్‌రావు, ఉద్యాన కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు, ప్రోటోకాల్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

చిత్రం.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్స్