తెలంగాణ

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన చేసిన విలేఖరుల సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం గురుకుల పాఠశాలల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని అంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు సమావేశమందిరంలోకి చొరబడ్డారు. మీడియా ప్రతినిధులను నెట్టుకుంటూ వేదిక వద్దకు చేరుకుని శ్రీశైలంపై ఒక్కసారిగా దాడిచేశారు. పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రస్థాయిలో దాడి చేశారు. భయాందోళనకు గురైన శ్రీశైలం అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన వెంటపడి విచక్షణారహితంగా కొట్టారు. సమావేశం నిర్వహిస్తున్న వారిపై దాడి చేయడం సరికాదంటూ మీడియా ప్రతినిధులు అడ్డుకునేందుకు యత్నించగా దుర్భాషలాడుతూ వారిపైనా దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసిన అలెగ్జాండర్‌తో పాటు పలువుర్ని అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం శ్రీశైలం మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వైరోలే తనపై దాడి చేశారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్ గురుకులాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గురుకులాలను మత మార్పిడి కేంద్రాలుగా మారుస్తూ భారత వ్యతిరేక భావనలను పిల్లలకు బోధిస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై మాట్లాడితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు గురుకులాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.