తెలంగాణ

చల్లబడిన రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: రాష్ట్రం మంగళవారం సాయంత్రం కాస్త చల్లబడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. చాలా చోట్ల 32 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచాయి. నిజామాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాలో స్వల్పంగా వాన కురిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది. ఇలా ఉండగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ అధికారులు ప్రకటించారు. గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఆదిలాబాద్, రామగుండంలో నమోదైందని ఐఎండీ ప్రకటించింది. గత 24 గంటల్లో జూలూరుపాడు (్భద్రాద్రి కొత్తగూడెం)లో రెండు సెంటీమీటర్లు, దుబ్బాక (సిద్ధిపేట) లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో చిన్నపాటి వర్షం కురిసింది.

చిత్రం... హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షంలో వెళ్తున్న వాహనాలు