తెలంగాణ

కానిస్టేబుల్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 21: తనను, తన తోటి సిబ్బందిని ఎస్‌ఐ వేధిస్తుండటంతో పాటు అవినీతికి పాల్పడుతున్నాడని రెండురోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ తనను లక్ష్యంగా చేసుకొని ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తనతో పాటు ఇతర సిబ్బందిని కూడా వేధిస్తుండటంతో పాటు అవినీతికి పాల్పడుతున్నాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మూడురోజుల క్రితం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో కానిస్టేబుల్ రమేష్‌ని సస్పెండ్ చేస్తున్నట్టు ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు.