తెలంగాణ

ప్రధానిగా మోదీ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ అన్ని విధాలా విఫలమయ్యారని, ఒక దశలో బెంగాల్ సీఎంను బెదిరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. తమతోనే ఉండాలని లేకుంటే బెంగాల్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ బెదిరిస్తోందని, ఇలాంటి బెదిరింపులకు మమతా బెనర్జీ భయపడేది లేదని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను తాము నమ్మడం లేదని అన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, యూపీ , తెలుగు రాష్ట్రాల్లో సీట్లు రాకుండా బీజేపీ కేంద్రంలో ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నిలదీశారు. ఈవీఎం ట్యాంపరింగ్ మీదనే బీజేపీ ఆధారపడి అధికారంలోకి రానున్నదా అని ప్రశ్నించారు. సిగ్గువిడిచి ఫిరాయింపులతో రాజకీయ వ్యభించారం కన్నా దారుణంగా ఇటు కేసీఆర్ అటు నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కంటే సీపీఐకి ఎక్కువ సీట్లు వస్తాయని, పార్లమెంటులో తమ వాణిని వినిపిస్తామని చెప్పారు. మీడియా ప్రతినిధులను అడిగినట్టు రాజకీయ నాయకులను ఏ పార్టీలో ఉన్నావని అడగాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. 50 శాతం క్రిమినల్స్, 20 శాతం రేపిస్టులు పార్లమెంటులోకి అడుగుపెడుతున్నారని వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఎలాంటి విశ్వసనీయత లేదని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వ్యవస్థలూ బ్రస్టుపట్టాయని, ఇంటర్ విద్యార్థుల కుటుంబాల పరామర్శకు ప్రభుత్వానికీ, అధికారులకూ, మంత్రులకు ఓపిక, సహనం లేదని, ఆత్మహత్యలకుపాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై కూడా మాట్లాడటం లేదని, హైకోర్టులో చర్చ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. కానీ ప్రభుత్వం నుండి మచ్చుకైనా ఒక మాట రావడం లేదని, ఆరేళ్ల తెలంగాణలో ఆత్మగౌరవ పాలన బదులు నిజాం పాలన నడుస్తోందని అన్నారు. జూన్ 2న 9.30 గంటలకు అమరవీరులకు నివాళులు అర్పించి, ఆకాంక్షల లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో కమ్యూనిస్టులు ఎపుడూ కనుమరుగు కారని బీజేపీ గుర్తుంచుకోవాలని అన్నారు.