తెలంగాణ

గులాబి గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: శాసనమండలి ఎన్నికల్లో ఆరు సీట్లను ఏకగ్రీవంగా, నాలుగు సీట్లను పోటీలో గెలిచినందుకు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావులో ఆనందం లేదు. దక్షిణ తెలంగాణలోని కీలకమైన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మూడు స్ధానిక సంస్థల మండలి ఎన్నికల్లో రెండు స్ధానాలను పొగొట్టుకున్నందుకు కెసిఆర్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా లో అనూహ్యంగా టిఆర్‌ఎస్ గెలిచినందుకు ఆ పార్టీ నేతల్లో ప్రస్ఫుటించిన ఆనందోత్సాహాలను పాలమూ రు, నల్లగొండ జిల్లాల్లో ఫలితాలు దెబ్బతీశాయి. ఈ రెండు జిల్లాల్లో నేతలు పోల్ మేనేజిమెంట్‌లో విఫలమయ్యారని పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. ఈ రెండు జిల్లాల నేతలను కెసిఆర్ చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ అ భ్యర్ధి ఓటమి చెందడానికి మంత్రు లు డాక్టర్ లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుల వ్యూహాత్మక తప్పిదాలు, మితిమీరిన విశ్వాసం కారణమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నల్లగొండ జిల్లా లో మంత్రి జి జగదీశ్వర్‌రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిని ఓడిస్తారనుకున్నారు. కాని ఓటమి ఎదురుకావడంతో పార్టీ వర్గాలు ఖంగు తిన్నాయి. కనీసం వంద ఓట్లతో టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఇక్కడ గెలుస్తారని మంత్రి అనుచరులు మొదటి నుంచి ధీమాగా ఉన్నారు. కాని ఓట్ల లెక్కింపుతర్వాత రాజ్‌గోపాల్‌రెడ్డి 193 ఓట్లతో గెలిచారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పి మహేందర్‌రెడ్డి తన జిల్లానుంచి ఇద్దరు అభ్యర్ధులను టిఆర్‌ఎస్‌నుంచి గెలిపించడం పట్ల కెసిఆర్ అభినందించారు. ఒక్క సీటు కూడా గెలిచే శక్తి లేకపోయినా, ఇద్దరిని గెలిపించినందుకు మహేందర్‌రెడ్డిని టిఆర్‌ఎస్ శ్రేణులు అభినందలతో ముంచెత్తాయి.
ఇక ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌కు కేవలం మూడంటే మూడే ఓట్లు ఉన్నా, తీవ్రమైన పోటీలో గెలిచిందంటే, ఆ క్రెడిట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే దక్కుతుంది. ఇక్కడ వైకాపా బరిలో నిలబడడంతో, టిఆర్‌ఎస్ గెలిచింది. విపక్షాల మధ్య నెలకొన్న అనైక్యత టిఆర్‌ఎస్‌కు కలిసివచ్చింది.

ఊరించి... వరించిన విజయం

విజయోత్సవాల్లో కాంగ్రెస్ శ్రేణులు
18 నెలల విరామం అనంతరం అందిన గెలుపు
పార్టీ నేతల్లో పెరిగిన ఆత్మస్థయిర్యం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: విభేదాలను పక్కనపెట్టి సమష్ఠిగా పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బుధవారం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనుభవైకవేద్యమైంది. ఆరు శాసనమండలి స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రెండింటిని గెలుచుకోవడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. పార్టీ పెద్దలు భేషజాలను పక్కనపెట్టి కార్యకర్తలతో కలసి పనిచేసి, సత్ఫలితాలను రాబట్టారు. కాంగ్రెస్ కథ ముగిసిందనుకునేవారికి తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివే. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఆ పార్టీ నుంచి ఒక ఎంపి, ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ రెండు జిల్లాల నుంచి గెలిచారు. నల్లగొండ జిల్లా నుంచి సిఎల్‌పి నేత కె జానారెడ్డి, టిపిసిసి అధ్యక్షులు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మరో సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ, చిన్నారెడ్డి లాంటి సీనియర్లు కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లోగెలిచారు. తాజా మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి నల్లగొండ జిల్లాలో తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ధి టి చిన్నపరెడ్డిపై 193 ఓట్లతో గెలిచారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌నుంచి కె దామోదర్‌రెడ్డి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇక్కడ టిఆర్‌ఎస్ అభ్యర్ధి జగదీశ్వర్‌రెడ్డి ఓటమి చెందారు. టిడిపి, బిజెపి ఓటర్ల రెండవ ప్రాధాన్యత ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. ఈ రెండు జిల్లాల్లో మండలి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తన సత్తా చాటింది. నల్లగొండ జిల్లాలో నకరేకల్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సమిష్టిగా వ్యూహాత్మకంగా పనిచేసి తన అభ్యర్ధిని గతంలో గెలిపించుకుంది. టిఆర్‌ఎస్ ఇక్కడ ఓటమిని చవిచూసింది. ఈ రెండు ఎన్నికలను గతంలో కూడా టిఆర్‌ఎస్ మంత్రులే పర్యవేక్షించారు.
రంగారెడ్డి జిల్లా మండలి ఎన్నికల్లో రెండు సీట్లలో ఒక సీటు కాంగ్రెస్ వాస్తవానికి గెలవాలి. కాని కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఆ పార్టీని ఓడించాయి. దీంతో రెండు సీట్లనూ టిఆర్‌ఎస్సే గెలుచుకుంది.
మూడు జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీనుంచి వైదొలగడం, నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ ఆత్మస్ధైర్యం దెబ్బతింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టిఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో ఆరు సీట్లు పడ్డాయి.
సంబరాల్లో కాంగ్రెస్
మూడు స్ధానిక సంస్థల మండలి ఎన్నికల్లో రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడంపై టిపిసిసి అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె జానారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం, ప్రజాప్రతినిధులను బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం, సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు ఓటర్లను కొనడం లాంటి అత్యంత నీచమైన రాజకీయాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా తమ పార్టీ నల్లగొండలో 642 ఓట్లను సాధించి 193 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించామన్నారు. మహబూబ్‌నగర్ జిలా లలో ఒక సీటులో 379 ఓట్లు సాధించి విజయం సాధించామన్నారు. రాబో యే గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్ధులను సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక చేసి డివిజన్లలో ఎవరికి గెలిచే అవకాశాలున్నాయో కార్యకర్తలే నిర్ణయిస్తారని, వారిని ఎంపిక చేస్తామన్నారు.

మూడు స్ధానిక సంస్థల మండలి ఎన్నికల్లో రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడంపట్ల
బుధవారం గాంధీభవన్‌లో సంబరాల్లో మునిగితేలిన కాంగ్రెస్ శ్రేణులు