తెలంగాణ

ఇతర శాఖలకు ‘హౌసింగ్’ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న మిగులు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇతర శాఖల్లో సర్దు బాటు చేయనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల వల్ల ఆయా శాఖల్లో పని భారం పెరిగిందని, కార్పొరేషన్‌కు చెందిన కొందరు ఉద్యోగులను ఆ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్టు చెప్పారు. హౌజింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సంస్థ విభజన కార్పొరేషన్‌లో మిగులు సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడం వంటి పలు అంశాలపై చర్చించారు. వివిధ శాఖల్లో ఖాళీల ప్రకారమే సర్దుబాటు చేస్తామని, మిగితా ఉద్యోగులు హౌజింగ్ కార్పొరేషన్‌లోనే విధులు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయని అక్కడ కూడా కార్పొరేషన్ ఉద్యోగుల సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6488 ఇండ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్‌లలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నట్టు చెప్పారు.
195 మసీదుల్లో ఇఫ్తార్: తలసాని
ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 195 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రెండు లక్షల కుటుంబాలకు 12 కోట్ల రూపాయల వ్యయంతో దుస్తులను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. మరో నాలుగు కోట్ల వ్యయంతో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.