తెలంగాణ

ఉష్ణ ప్ర‘తాపం’ ఉసురు తీస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, రెబ్బెన, జమ్మికుంట, మే 21: వడదెబ్బకు రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెంలో ఉపాధి హామీ పథకం కూలీ మునగాల సైదమ్మ (30) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సైదమ్మ దంపతులు రోజుకూలీ జీవనోపాధిగా బతుకుతున్నారు. ఉపాధి కూలీ పనులకు వెళ్లి పనులు చేస్తున్న చోటనే ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురై పడిపోయింది. 108అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అక్కడినుండి హైద్రాబాద్ మలక్‌పేట యశోదకు తరలించగా, చికిత్స పొందుతూ సైదమ్మ మృతి చెందింది. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వడదెబ్బ తగిలి మంచిర్యాల జిల్లా రెబ్బెన మండలం కైరిగూడలో పనిచేస్తున్న ఫిట్టర్ శనిగారపు పాల్ మంగళవారం వడదెబ్బ తగిలి మృతిచెందారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం చేత ఓపెన్ కాస్టులో పనిచేయడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ఎన్నోసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని, పని వేళలను మార్పు చేయమంటే పట్టించుకోలేదని టిబిజికే ఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రారు శ్రీనివాస్ రావు, ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. కరీంనగర్ జిల్లాలలోని జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలోని గుల్లి రామయ్య (63) అనే వృద్ధుడు వడ దెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా పెరిగిన ఎండ తీవ్రత తట్టుకోలే, అస్వస్తతకు గురై మృతి చెందినట్లు భార్య మధునమ్మ తెలిపారు.