తెలంగాణ

ప్లాస్టిక్ వాడకంపై చర్యలు కఠినతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 21: పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతిని వికృతిగా మార్చే ప్రమాదకరమైన ప్లాస్టిక్ వాడకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠితర చర్యలకు ఉపక్రమించాయ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ప్లాస్టిక్ వాడక నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయ. ఈ క్రమంలో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ మున్సిపల్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా నిషేధించాలి, దీని కోసం ఏమి చేయాలన్న దానిపై దిశానిర్దేశాలు జరిగాయ. ఇంతే కాకుండా మంగళవారం నేరుగా అన్ని మున్సిపాలిటీలు, మేజర్ జీపీలకు ప్లాస్టిక్ వాడక నిషేధం కచ్చితంగా అమలు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు అందడంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ మున్సిపల్ కమిషనర్‌లు కిరాణా దుకాణాలకు, హోటల్స్ నిర్వహకులకు, స్వీట్‌హోమ్‌లు, కూరగాయల దుకాణాల వారికి అవగాహన సదస్సు నిర్వహించేందుకు అందరికి సమాచారం అందించారు. ప్లాస్టిక్ నిషేధం అమలుపై ముందుగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్న ప్రజలతో పాటు వ్యాపారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు.
అవగాహన సదస్సుల అనంతరం ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడినట్లైతే వారికి భారీ జరిమానాలు విధించేందుకు సైతం మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణ పరిరక్షణకు ఆటంకం ఏర్పడుతుండటంతో పాటు ఎన్నో రకాల సమస్యలకు మూల కారణం అవుతుండటంతో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్లాస్టిక్ కవర్స్‌లోనే హోటల్స్ నుంచి తెచ్చే టిఫిన్‌లు, సాంబార్, చట్నీలాంటివి వాడిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల ప్లాస్టిక్ కవర్‌లో మిగిలిన చట్నీ, లేదా సాంబర్, అన్నం కోసం రోడ్లపై తిరిగే పశువులు, చివరకు కోతులు సైతం ఆ ప్లాస్టిక్‌ను తినడంతో అవి అనారోగ్యాలకు గురి కావడమే కాకుండా పర్యవరణానికి హాని కలిగే విధంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ కవర్‌లు, బాటిల్స్ భూమిపై ఎక్కడపడితే అక్కడ పడేయడంతో అవి భూమిలో కరగకపోవడం, కాలక పోవడం వల్ల అది ఎక్కడ పడేస్తే అక్కడే ఉండటం వల్ల భూగర్భజలాలకు సైతం అడ్డం పడ్తున్నట్టు పర్యావరణ పరిరక్షకులు అంటున్నారు. ప్లాస్టిక్‌ను తగులబెట్టడం వల్ల అది రబ్బర్‌గా మారి ఒక ముద్దగానే ఉంటుంది తప్ప పూర్తిగా భూమిలో కరిగిపోదు. ఇలా ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ వల్ల ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ తయారు చేసే సంస్థలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాల్సి ఉంటుంది. పైనుండే మార్కెట్‌లోకి ప్లాసిక్ కవర్‌లు రాకుంటే తామేందుకు కొంటామని ప్రజలు అంటున్నారు. ప్లాస్టిక్ కవర్‌ల స్థానంలో పేపర్ కవర్‌లు వస్తే తమకే మంచిదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు కొన్ని చోట్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం గమనార్హం.
ప్లాస్టిక్‌లోని వస్తువులు తినడం వల్ల కూడా ప్రజలకు ఆరోగ్య రక్షణ లేకుండా ఆరోగ్యాలు పాడవుతాయని ఎన్నో సందర్భంగా వైద్యులు సైతం సూచించడం గమనార్హం. ఐఎస్‌ఐ మార్క్‌లేని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సైతం మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. ఇవి మరీమరీ ప్రమాదం అని తెల్సికూడా వీటి నివారణ చర్యలు మాత్రం లేవు. మొత్తానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణానికి హాని కల్గిస్తున్న ప్లాస్టిక్‌పై ఇచ్చిన మార్గదర్శకాలతో స్పందించిన జిల్లా కలెక్టర్ సైతం ప్లాస్టిక్ విషయమై సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ వాడుతున్న వారిని పట్టుకుని 45 వేల వరకు జరిమానాలు విధించినట్టు కలెక్టర్ వెల్లడించడం గమనార్హం. అవగాహన సదస్సుల అనంతరం మున్సిపల్ అధికారుల బృందం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎక్కడా ప్లాస్టిక్ వాడకం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆలస్యంగానైన స్పందించిన అధికారులు ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని కూకటి వేళ్లతో పెకలిస్తారా...? లేదా ...? తూతూ మంత్రంగా కానిచ్చి ‘మమ’ అన్పిస్తారా వేచి చూడాల్సిందే.