తెలంగాణ

30 నుండి ఏడాది పాటు సీఐటీయూ స్వర్ణోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: సీఐటీయూ ప్రారంభించి మే 30 వ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతుందని ఈ సందర్భంగా ఈ ఏడాది మే 30 నుండి వచ్చే ఏడాది 30 వ తేదీ వరకూ సీఐటీయూ స్వర్ణోత్సవాలను సంబరంగా నిర్వహించనున్నట్టు సీఐటీయూ కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షురాలు ఎస్ రమ, కార్యదర్శులు వీఎస్ రావు, జే వెంకటేష్‌లు చెప్పారు. వర్గదోపిడీ అంతానికి, సామాజిక మార్పునకు సీఐటీయూ నిరంతరం పోరాడుతోందని అన్నారు. మే 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సవాలను ప్రారంభిస్తామని, ఈ సభకు సీపీఎం మాజీ కార్యదర్శి బీవీ రాఘవులుతో పాటు జాతీయ, రాష్ట్ర నేతలు హాజరవుతారని పేర్కొన్నారు.
25న ఇఫ్టా వ్యవస్థాపక దినోత్సవం
తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ -ఇఫ్టా 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రజా నాట్యమండలి అధ్యక్షుడు నర్సింహా, ప్రధానకార్యదర్శి కన్నం లక్ష్మీనారాయణ పల్లె తెలిపారు.