తెలంగాణ

మరో 4 రోజులు వడగాడ్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. గత 24 గంటల్లో నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్‌లలో 45 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లో 41 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.
ఇలా ఉండగా గత 24 గంటల్లో హకీంపేటలో ఏడు సెంటీమీటర్ల వాన కురిసింది. ఆసిఫాబాద్ (కుమరంభీ) లో నాలుగు సెంటీమీటర్లు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, షాద్‌నగర్‌లలో రెండు సెంటీమీటర్లు, షామీర్‌పేట, నర్సాపూర్, లింగంపేట, గంగాధర, ఆళ్లదుర్గ్ నాగరెడ్డిపల్లి, గాంధారిలలో ఒక సెంటీమీటర్ చొప్పున వాన కురిసింది.