తెలంగాణ

విద్యుత్, ఆర్టీసి చార్జీలను ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూన్ 23: టిఆర్‌ఎస్ ప్రభుత్వం తక్షణమే ఆర్టీసి, విద్యుత్ రంగంలో పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం, వైకాపా పార్టీలు డిమాండ్ చేశాయి. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసి, విద్యుత్ రంగం పరిస్ధితిని మెరుగుపరచకుండా చార్జీలను పెంచడం దారుణమన్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. ఆర్టీసి చార్జీలను రూ. 286 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ. 1527 కోట్ల మేర పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. ఈ రెండు రంగాల అంతర్గత సామర్ధ్యం పెంచేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఏమీ లేవా అని ఆయన ప్రశ్నించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలపై భారం విధించడాన్ని సహించమని, టిడిపి త్వరలో ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. పెంచిన ఆర్టీసి, విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. పెంచిన చార్జీల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం దుబారాకు అలవాటుపడిందని, ప్రజల అవసరాలను మర్చిపోయిందన్నారు.