తెలంగాణ

తలతిక్క నిబంధనలతో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఏ మాత్రం అమలుకు సాధ్యం కాని కొత్త కొత్త నిబంధనలను అమలులోకి తేవాలని ఎఐసీటీఈ చూస్తోందని, దానివల్ల తీవ్ర గందరగోళం ఏర్పడుతోందని తెలంగాణ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాల సంఘం చైర్మన్ డాక్టర్ ఎన్ గౌతం రావు, ప్రధానకార్యదర్శి డాక్టర్ కే సునీల్ కుమార్‌లు పేర్కొన్నారు. గత విద్యాసంవత్సరం వరకూ ప్రైవేటు వ్యక్తులు, ట్రస్టులు, సొసైటీలు సాంకేతిక విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకునే వీలుండేదని, తాజాగా ప్రైవేటు ట్రస్టీలు, సొసైటీలు, కంపెనీలు సైతం సాంకేతిక విద్యాసంస్థలను ప్రైవేటు భూముల్లోనూ, భవనాల్లోనూ లీజును ఏర్పాటు చేసుకునే వీలుకల్పించిందని అన్నారు. ప్రైవేటు లీజు డీడ్‌లను వాడుకోవచ్చనే కొత్త నిబంధన వల్ల ఇంజనీరింగ్ విద్యకు సమస్యలు వస్తాయని వారు చెప్పారు. అలాగే రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల షిఫ్టింగ్ ఫైళ్లను ప్రభుత్వానికి పంపించడం అంటే సాచివేత ధోరణి ప్రదర్శించడమేనని వారు అన్నారు.