తెలంగాణ

ఒకే దరఖాస్తుతో రాష్ట్రంలో ఎక్కడైనా ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక దరఖాస్తుతో ప్రభుత్వ, ప్రైవేటు , ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు ఉద్ధేశించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ) అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి బుధవారం సాయంత్రం విడుదల చేశారు. దోస్త్‌పై అవగాహనకు పోర్టల్‌తో పాటు యాప్‌ను కూడా అదే పేరుతో రూపొందించామని అన్నారు. ఏ కాలేజీలో ఏ ఏ బ్రాంచిలు ఉన్నాయో, సీట్లు, కాలేజీల చిరునామా తదితర వివరాలు పొందవచ్చని అన్నారు. విద్యార్థులు రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీలకు ఒకే దరఖాస్తు సరిపోతుందని చెప్పారు.దీనివల్ల ఎక్కువ దరఖాస్తులు చేయాల్సిన అవసరం రాదని పేర్కొన్నారు. మూడు అంచెల్లో దోస్త్ అడ్మిషన్లు జరుగుతాయని, ఇప్పటికే ఫలితాలు వచ్చిన వారు తొలిదశలో అడ్మిషన్లు తీసుకుంటే , ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు దోస్త్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.
దోస్త్ రిజిస్ట్రేషన్ మే 23 నుండి ప్రారంభం అవుతుందని, జూన్ 3 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుందని అన్నారు. వీరంతా తమ వెబ్ ఆప్షన్లను మే 25 నుండి జూన్ 3 వరకూ ఇవ్వాల్సి ఉంటుందని, రిజిస్ట్రేషన్ జాప్యం జరిగితే జూన్ 4న రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అందుకు 400 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరి అభ్యర్ధులకు జూన్ 1 నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని, తొలి దశ సీట్ల కేటాయింపు జూన్ 10న జరుగుతుందని చెప్పారు. అదే రోజు నుండి 15వ తేదీలోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. రెండో దశ అడ్మిషన్లు జూన్ 10 నుండి ప్రారంభం అవుతాయని, 15వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌కు వీలుంటుందని, 15వ తేదీ నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, వారందరికీ జూన్ 20న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఆన్‌లైన్ రిపోర్టింగ్ జూన్ 20 నుండి 25 వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. మూడోదశ జూన్ 20న ప్రారంభం అవుతుందని, 25 వరకూ కొనసాగుతుందని, 25వ తేదీ నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని, జూన్ 29న సీట్ల కేటాయింపు ఉంటుందని అన్నారు.
జూలై 1 నుండి నాలుగో తేదీలోగా ఆన్‌లైన్‌లో కాలేజీల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. తొలి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుండి ప్రారంభం అవుతాయని తెలిపారు. కాలేజీల్లో మిగిలిన సీట్లకు స్లైయిడింగ్ అవకాశం జూలై 5 నుండి జూలై 7వ తేదీ వరకూ ఉంటుందని వారందరికీ జూలై 10న సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.
ఈసారి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేశామని, కేవలం హాల్‌టిక్కెట్ నెంబర్లు ఇస్తే డాటా క్యాప్చురింగ్ సదుపాయం కల్పించామని వారు చెప్పారు.