తెలంగాణ

అకాల వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలు, పెద్దఎత్తున ఈదురు గాలులు వీచడంతో విద్యుత్ సంస్థలకు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. పాత ఉమ్మడి జిల్లాలు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో విద్యుత్ సంస్థలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు వందలాది విద్యుత్ స్తంభాలు, 133 విద్యుత్ సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణ కోసం కార్మికులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారని తెలిపారు. నష్టాల అంచనా పూర్తిగా అందలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇంతల, కమ్మరపల్లి, రంగంపేట, లింగాల, యాదాద్రి పరిసర ప్రాంతాలు, నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖకు నష్టాలు వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా జంటనగరాల్లో విద్యుత్‌కు అంతరాయం కల్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జంటనగరాల్లో రహదార్లపై విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వనస్థలిపురం, తిరుమలగిరి ప్రాంతల్లో గంటల తరబడి విద్యుత్‌ను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.