తెలంగాణ

బిసి విద్యార్థులకూ ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇదే తరహాలో బిసి విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించడానికి మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చేపట్టిన పథకాలను బిసి సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసినట్టే బిసి విద్యార్థుల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 23 గురుకుల పాఠశాలలు బిసిల కోసం ఉన్నాయని, వీటిలో 16 పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇవ్వే కాకుండా కొత్తగా బాల, బాలికల కోసం మరిన్ని గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల మాదిరిగానే బిసిలకు గురుకుల విద్యాలయాలు ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో బిసి సంక్షేమశాఖ అధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా ఉండగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. అదే విధంగా ఇతర కుల వృత్తుల జీవానోపాధికి మార్గాలను అద్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బిసిలలో అన్ని కులాలు ఆర్థిక పరిస్థితి ఒకేలా లేదని, కొన్ని కులాలు బాగా వెనుకబడి ఉన్నాయని, వీరి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.