తెలంగాణ

గురుకులాల ప్రతిష్ట పెంచిన ప్రవీణ్‌కుమార్‌పైనే ఆరోపణలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23:గురుకులాల ప్రతిష్టను అన్ని విధాల పెంచుతున్న కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను దూషించడం, నిందలు వేయడం సరికాదని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సోలపోగుల స్వాములు పేర్కొన్నారు. పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు అంతా సచివాలయంలోని పలువురు అధికారులను కలిసి గత నాలుగు రోజులు క్రితం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై చేసిన అసత్య ఆరోపణలను ఖండించారు. తెలంగాణ సచివాలయంలోనే తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, హోం శాఖ కార్యదర్శి రాజు త్రివేణి , ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నే శ్రీశైలం చేసిన ఆరోపణల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని , కర్నే శ్రీశైలంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.