తెలంగాణ

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి గుణపాఠం తగిలిందని సీపీఐ రాష్ట్ర కార్యిదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సారు-కారు-పదహారు అంటూ టీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం బెడిసికొట్టిందని అన్నారు. ఈ గుణపాఠంతోనైనా ప్రజాస్వామ్య పంథాలో రాష్ట్ర పాలనను కేసీఆర్ శ్రీకారం చుడతారని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు అనూహ్యమని, దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగించాయని, ప్రత్యేకించి వామపక్షాలు లోతైన పరిశీలన చేసుకోవాలని, మితవాద, మతవాద బీజేపీ గెలుపు ప్రజాస్వామ్య శక్తులకు ఒక సవాల్ అని అన్నారు.