తెలంగాణ

టీఆర్‌ఎస్ పతనం మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణలో నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ గెలవడంతో పార్టీ శ్రేణులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కార్యాలయంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో మంచి విజయాలు, జాతీయ స్థాయిలో బంపర్ మెజారిటీ దక్కడంతో బీజేపీ నేతలు భారత్ మాతాకీ జై, బీజేపీ జిందాబాద్, మోదీ జిందాబాద్ నినాదాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ కార్యాకర్తల నుంచి ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనమండలి పక్ష నేత ఎస్ రామచందర్ రావునేతృత్వంలో బీజేపీ నేతలు స్వీట్లు కార్యకర్తలకు స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కారూ, సారూ, పదహారు నినాదానికి ప్రజలు చరమగీతం పాడారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఎక్కువ కాలం అధికారంలో ఉండదని, లుకలుకలు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అందుకే ప్రజలు విసుగుచెంది కోపంతో టీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కు కింద ఓడించారన్నారు. కుటుంబ పార్టీలు, విభజన రాజకీయాలు చేసిన వారిని ప్రజలు తిప్పిగొట్టారన్నారు. ఈ విజయం మోదీ పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు ఉంటాయన్నారు.
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ అవతరిస్తుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడేందుకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. సీఎం కుమార్తె కవితను బీజేపీ ఓడించడం పార్టీ శ్రేణులకు గర్వకారణమన్నారు. మోదీ కులం, వేసుకునే బట్టలు, తినే ఆహారం మీద రాజకీయాలు చేసిన వారిని ప్రజలు చెంపపెట్టులా బుద్ధి చెప్పారన్నారు. బీసీ, దళితులు, ఈబీసీలు, మైనారిటీలు బీజేపీకి అండగా నిలబడ్డారని లక్ష్మణ్ అన్నారు. టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేనిపోరు చేస్తామని చెప్పారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకున్నారన్నారు. ప్రధానమంత్రిని ఎఐసీసీ అధ్యక్షుడు దూషించడాన్ని ప్రజలు భరించలేకపోయారన్నారు. రాష్ట్రంలో పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్టం చేస్తామన్నారు. ఈ విజయాలతో బీజేపీ ఆగదని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై జనంలోకి వెళతామన్నారు.
చిత్రాలు.. బీజేపీ కార్యాలయం వద్ద లక్ష్మణ్ ఆనందోత్సవం

*కిషన్‌రెడ్డిని అభినందిస్తున్న బీజేపీ నేత దత్తాత్రేయ