తెలంగాణ

పాలమూరులో గుబాళించిన గులాబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 23: పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో గులాబీ గుబాళించింది. గురువారం పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వెలువడడంతో రెండు పార్లమెంట్ స్థానాలు తెరాస ఖాతాలోకి వెళ్లాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ రెండు పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన మనె్న శ్రీనివాస్‌రెడ్డి 78120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన పోతుగంటి రాములు 189543 ఓట్ల భారీ మెజారీటీతో ఘన విజయం సాధించారు. దాంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి మనె్న శ్రీనివాస్‌రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి డికే అరుణపై విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మనె్న శ్రీనివాస్‌రెడ్డికి 411241 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి డికే అరుణకు 333121 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా వంశీచంద్‌రెడ్డికి 193513 ఓట్లు వచ్చాయి. తెరాస అభ్యర్థి మనె్న శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ 78120 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెరాస మూడోసారి విజయం సాధించింది. తెరాస హ్యాట్రిక్ విజయంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. 2009లో తెరాస అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో తెరాస నుండి ఎంపీగా పోటకీ చేసి అప్పట్లో గెలుపొందారు. దాంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌కు నియోజకవర్గంలో పునాదులు బలంగా మారాయి. అదేవిధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కోటాలో తొలిసారిగా తెరాస తన జెండాను ఎగురవేసింది. నాగర్‌కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములుకు 498686 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ముల్లురవికి 309143 ఓట్లు వచ్చాయి. దాంతో 189543 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బంగారు శృతికి 128686 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా రెండు పార్లమెంట్ స్థానాలు తెరాస ఖాతాలోకి వెళ్లడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా సంబురాల్లో మునిగితేలారు. మహబూబ్‌నగర్ ఎంపీగా గెలుపోందిన మనె్న శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలుపొందిన రాములుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపుపత్రాన్ని అందజేశారు. కాగా మహబూబ్‌నగర్ ఎంపీ సీటుపై బీజేపీ నాయకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను ఓటర్లు తలకిందులు చేస్తూ తెరాసకు పట్టం కట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా మాత్రం చాలా తేడాతో ఓటర్లు తీర్పునిచ్చారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం మహబూబ్‌నగర్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మెజారిటీ దక్కింది. మిగతా నియోజకవర్గంలో మెజారిటీ తెరాస అభ్యర్థి మనె్న శ్రీనివాస్‌రెడ్డికి రావడంతో ఆయన ఘన విజయం సాధించారు.