తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్ల్లో వరంగల్‌దే రికార్డు స్థాయ మెజార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 23: పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో వరంగల్ పార్లమెంటు స్ధానం మెజార్టీ మరో సారి రికార్డుకు ఎక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు దక్కింది. గతంలో భారతదేశ వ్యాప్తంగా పసునూరి దయాకర్‌కు మెజార్టీలో ఏడవ స్ధానం దక్కగా ఈసారి ఓటింగ్ శాతం తగ్గిన కారణంగా 3 లక్షల 57 వేల 867 భారీ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వరంగల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కూడా లక్షా 48వేల 373 మెజార్టీ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించినందుకు మంత్రి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తామని అన్నారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, టెక్స్‌టైల్ పార్కుతో పాటు కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ, కాజీపేట ఫై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని అన్నారు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన నిలబడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని అన్నారు. సమావేశంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలమంతా కలిసి, మంత్రి దయాకర్‌రావు నేతృత్వంలో పోటీపడి ఎంపీ ఎన్నికల్లో పనిచేశామని అన్నారు. స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ తన నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే నేటి పార్లమెంటు ఎన్నికల్లోనే భారీ మెజార్టీ వచ్చిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తన నియోజకవర్గం నుండి అత్యధికంగా 63వేల మెజార్టీ వచ్చే విధంగా కృషి చేశామని అన్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపి సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్. ఎన్. సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.