తెలంగాణ

కరీంనగర్‌లో కాషాయ రెపరెపలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 23: తెలంగాణ ఉద్యమ గుండెకాయ కరీంనగర్‌లో కమలం వికసించింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ఎదురుచూపులనంతరం మరోసారి జయకేతనం ఎగరవేసింది. కార్యకర్తలే లేరన్న చోట మేమున్నామంటూ ఓటర్లు అక్కున చేర్చుకుని ఆదరించగా రాష్ట్రంలోనే ఆ పార్టీకి అత్యధిక మెజారిటీ లభించగా, పురిటిగడ్డపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. సెంటిమెంట్‌నే నమ్ముకొని లోక్‌సభ తొలి అభ్యర్థిని కరీంనగర్ నుంచే ప్రకటించి, ప్రచారసభను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసారి మాత్రం ఇక్కడి ప్రజలు కోలుకోలేని షాకిచ్చారు.
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్నా, బీజేపీ అనూహ్యంగా జయకేతనం ఎగురవేసింది. కేవలం మంత్రి ఇలాఖా అయిన హుజూరాబాద్, టీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సెగ్మెంట్లలో స్వల్ప ఆధిక్యతను మాత్రమే కనబర్చిన టీఆర్‌ఎస్ మిగతా ఐదు చోట్ల పూర్తిగా వెనుకబడిపోయింది. ఆ పార్టీ సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కనబర్చిన అతివిశ్వాసం మిగతా చోట్ల ఓట్లు తగ్గేందుకు కారణమైంది. బీజేపీకి ప్రధానంగా కరీంనగర్ అసెంబ్లీతో పాటు చొప్పదండి, మానకొండూర్, వేములవాడ, హుస్నాబాద్‌లో సైతం మెజారిటీ ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేయగా, కిందిస్థాయి కేడర్ ఈసారి పూర్తిగా బీజేపీ అభ్యర్థికి సహకరించినట్టు ఆయా సెగ్మెంట్లలో వచ్చిన మెజారిటీ స్పష్టం చేస్తోంది. దీనికి తోడు ‘సారూ.. కారు..పదహారు’ తథ్యమంటూ ఆ పార్టీ నేతలు తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపేయత్నం చేయగా, అది ఘోరంగా వికటించింది. చాపకింద నీరులా బీజేపీ తన ప్రచారాన్ని కొనసాగించింది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించడంలో ఆ పార్టీ నాయకుల కృషి ఫలించింది. అలాగే, యూత్ లీడర్‌గా తనకున్న ఫాలోయింగ్‌తో పాటు ఇప్పటికే రెండుసార్లు ఓటమి పాలైన సానుభూతి పవనాలు మెండుగా వీయటంతో కరీంనగర్‌లో కారు టైర్లు ఎక్కడికక్కడే పంక్చరయ్యాయి.
ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి రౌండునుంచే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ స్పష్టమైన ఆధిక్యతను కనబర్చాడు. 17వ రౌండు నుంచి 20వ రౌండు వరకు కొద్దిగా మెజారిటీలో తేడా కనిపించినా అనంతరం తిరిగి పుంజుకున్నారు. లెక్కింపులో రౌండు రౌండుకు మెజారిటీ పెరుగుతుండగా, గెలుపు తమదే అనే ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ ఏజెంట్లు ఒక్కొక్కరు లెక్కింపు కేంద్రం నుంచి వెనుతిరగటం మొదలు పెట్టారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం లెక్కింపు పూర్తయ్యేసరికి ఆ పార్టీ ఏజెంట్లు ఒక్కరు కూడా మిగలలేదు. బీజేపీ శిబిరంలో క్రమేపి సంబురాలు మిన్నంటి నగరంలో ర్యాలీలు నిర్వహించారు.