తెలంగాణ

జూలై నుంచే ఎత్తిపోతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన బ్యారేజిల నుంచి నీటి ఎత్తిపోతలకు ఎదురవుతున్న బాలారిష్టాలను అధిగమించి జూలై నుంచే నీటి ఎత్తిపోతల ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుఅధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజి నుంచి నీటిని ఎత్తి రిజర్వాయర్లకు తరలించే క్రమంలో కొన్ని బాలారిష్టాలు ఎదురవుతున్నట్టు అధికారులు
సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను ఎప్పిటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జూలై నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతున్న క్రమంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతిభవన్‌లో శుక్రవారం అధికారులతో సీఎం సమీక్షించారు. ఇప్పటిదాకా కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఇక నుంచి నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్టుగానే కాలువ నిర్వహణ కోసం సమగ్ర వ్యూహాన్ని రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాలువలు, తూములను నిర్వహించడానికి సర్వసన్నద్ధం కావాలన్నారు. ‘తెలంగాణ ఇప్పటివరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలతో పాటు ఇతర కాలువలకు మూడు నాలుగేళ్లకోసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. దీంతో నీటి ప్రవాహాన్ని పంట పొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాల్వల నిర్వహణకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారుతుంది. తెలంగాణలో వర్షం పడకున్నా సరే, ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుంది. మేడిగడ్డ నుంచి సుందిళ్ళ, అన్నారం ద్వారా మిడ్ మానేరు, ఎల్లంపల్లికి అక్కడి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు , ఇటు మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్ వరకు నీరు పంపింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం కావాలి. మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు నింపుతాం. ఈ రిజర్వాయర్లలో గేట్లు, తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి. ఎప్పడంటే అప్పుడు గేట్లు తీసి వేసేలా సిద్ధం చేయాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, సరస్వతి కాలువ, గుత్స కాలువ, అలీ సాగర్ కాలువలు అన్నింటినీ 20 రోజుల్లో పూర్తి చేయాలి’ అని సీఎం ఆదేశించారు.కాలువల పూర్తి సామర్ధ్యంపై ఇంజనీర్లతో వర్క్ షాపులు నిర్వహించి విధానాన్ని ఖరారు చేయాలని సూచించారు.