తెలంగాణ

అమెరికాలో టి.డెస్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం తరఫున అమెరికాలో కంట్రీ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ రాహుల్ వర్మతో హైదరాబాద్‌లో కెటిఆర్ శుక్రవారం ఉదయం సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ వ్యాపార వాణిజ్య సంబంధాల్లో అమెరికా తెలంగాణకు సహజ భాగస్వామి అని మంత్రి అన్నారు. గత నెలలోనే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించానని, అక్కడి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు మంత్రి కెటిఆర్ రిచర్డ్‌కు తెలిపారు. గత రెండేళ్లలో గూగుల్‌లాంటి దిగ్గజాలు హైదరాబాద్‌కు రావడం శుభపరిణామమన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటి, ఫార్మా, లైఫ్ సైనె్సస్ వంటి 14 ప్రాధాన్యతా రంగాల్లో అమెరికాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలోని ఫార్మా స్యూటికల్ కంపెనీలు అమెరికాలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో త్వరలోనే ఒక ఫార్మా కంపెనీల ప్రతినిధి బృందాన్ని అమెరికా తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమెరికాలో ఒక కంట్రీ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వ ఆలోచనను రిచర్డ్ అభినందించారు. దీని ద్వారా తెలంగాణ, అమెరికా పరస్పరం సహకరించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోసారి కలుస్తానని కెటిఆర్ రిచర్డ్‌కు తెలిపారు. టి.హబ్ సందర్శనకు రావాలని రిచర్డ్‌ను ఆహ్వానించారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థలతో పలు రంగాల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అక్కడి వర్శిటీలతో భాగస్వామ్యానికి సహకరించాలని రిచర్డ్‌ను కోరారు. సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో ఇప్పటికే పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను వివరించారు. అమెరికాలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కెటిఆర్ రిచర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకుండా మరింత సమాచారం, శిక్షణ ఇచ్చేందుకు సహకరిస్తామని రిచర్డ్ మంత్రికి హామీ ఇచ్చారు. రాయబారితో జరిగిన సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తోపాటు అమెరికా హైదరాబాద్ కాన్సుల్ జనరల్ మైకెల్ మలిన్స్ ఉన్నారు.

చిత్రం... యుఎస్ అంబాసిడర్‌తో సమావేశమైన మంత్రి కెటిఆర్