తెలంగాణ

ఐదు రోజులు అగ్ని గుండమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: వచ్చే ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు రావద్దని కోరింది. రాష్ట్రం శుక్రవారం అగ్ని గుండంలా మారింది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 46 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌లో 45, నల్లగొండలో 40, భద్రాచలంలో 41, హకీంపేట, దుండిగల్‌లో 40 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు, మెదక్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం పలు పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్‌లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.