తెలంగాణ

నేడు ముదిగొండ వీరభద్రయ్యకవిత్వకళాతత్వం గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: సుప్రసిద్ధ సాహిత్య, కళాతత్వ విమర్శకులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రాసిన కవిత్వకళాతత్వం గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్లవిభాగం విశ్రాంతాచార్యులు అన్నంరాజు సుబ్బారావు శనివారం ఉదయం ఓయూ అతిథి గృహంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. తొలి ప్రతిని తెలుగు అకాడమి పూర్వసంచాలకుడు వెల్చాల కొండల రావు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహిస్తారు. విశిష్ట అతిథులుగా ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, మాజీ వీసీ ఆచార్య రవ్వాశ్రీహరి హాజరవుతారు. ఆత్మీయ అతిథులుగా ఆచార్య కే యాదగిరి, వారణాసి బీహెచ్‌యూ తెలుగు విభాగానికి చెందిన ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు పాల్గొంటారు. గ్రంథాన్ని డాక్టర్ సాగి కమలాకరశర్మ, డాక్టర్ పీ వారిజారాణిలు సమీక్షిస్తారు. కార్యక్రమాన్ని డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ వడ్లూరి ఆంజనేయ రాజు, అట్టెం దత్తయ్యలు నిర్వహిస్తున్నారు.