తెలంగాణ

వేసవి సెలవులు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగడంతో పాఠశాలలను జూన్ 1న పున:ప్రారంభించాలన్న ప్రభుత్వం మనసు మార్చుకుంది. ఇంత ఉష్ణతాపంలో స్కూళ్లు నడపడం భావ్యం కాదని, చిన్నపిల్లలు భారీగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేరని తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం, తల్లిదండ్రుల సంఘం, పలు విద్యార్థి సంఘాలు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదించింది. ఇంత వేసవిలో జూన్ 1 నుండి స్కూళ్లను నడపడం సరికాదని పేర్కొంటూ పాఠశాల విద్యా కమిషనర్ డాక్టర్ విజయకుమార్ చేసిన ప్రతిపాదనను విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి ఆమోదించి, ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు పున:ప్రారంభం వాయిదా మంచిదేనని, ఈలోగా టీచర్లు నియామకం, పుస్తకాలు దుస్తుల సరఫరా కానివ్వాలని టీపీఏ కోరింది.
ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలలు జూన్ ఒకటి నుండి కాకుండా జూన్ 12వ తేదీ నుండి పున:ప్రారంభించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యయుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఈ విరామంలోనైనా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేయాలని, పాఠ్యపుస్తకాలతో పాటు రెండు జతల దుస్తులను విద్యార్థులు అందరికీ పాఠశాలలు ప్రారంభం నుండే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరో ప్రకటనలో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా జూన్ 4 నుండి జరగాల్సిన బడిబాట కార్యక్రమం సైతం వాయిదా పడిందని అధికారులు చెప్పారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్లు సిద్ధం
ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్‌టిక్కెట్లను ఇంటర్ బోర్డు పోర్టల్‌లో ఉంచింది. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ వాటిని డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది 28వ తేదీలోగా వాటిని సరిదిద్దాలని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు.
ఓయూ వీసీ ఇంటి ముందు ఏబీవీపీ ధర్నా
ఉస్మానియా యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యవైఖరితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏబీవీపీ జాతీయ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వీసీ అధికారిక నివాసం ముందు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. పీజీ, ఇతర పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని, ప్రీ పీహెచ్‌డీ పరీక్షల్లో జరిగిన అవకతవకలతో 90 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారని ఆరోపించారు.