తెలంగాణ

నేరడిగొండలో పరువు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 24: పెద్దలు కుదిర్చిన పెళ్లికి అభ్యంతరం చెప్పడంతోపాటు, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానన్న కూతుర్ని కన్నతండ్రే కడతేర్చిన సంఘటన నేరేడిగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుమార్తె నిర్ణయంపై ఆగ్రహించిన తండ్రి, ఇంట్లో చున్నీతో కూతురి మెడకు ఉరివేసి కడతేర్చన ఘటన సంచలనం రేకెత్తించింది. నేరడిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నివాసం ఉంటున్న ప్రైవేట్ వైద్యుడు లక్ష్మణ్‌సింగ్ కుమార్తె చౌహన్ అఖిల (17) ద్వితీయ ఇంటర్‌ను ఇచ్చోడలో చదువుతోంది. తహసీల్దార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వేరే కులం యువకునితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, తాము కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవాలని సూచించారు. ప్రేమించిన వ్యక్తితోనే జీవితం పంచుకుంటానని అఖిల తెగేసి చెప్పడంతో, కులాంతర వివాహంతో సమాజంలో పరువు పోతుందని తండ్రి భావించాడు. ఇదే విషయంపై శుక్రవారం కూతురుతో గొడవపడి, ఆగ్రహావేశాలతో కుమార్తెను చున్నీతో ఉరి వేసి హతమార్చినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న వెంటనే ఆదిలాబాద్ డిఎస్పీ లక్ష్మీనారాయణ, బోథ్ సిఐ నాగేంద్రచారి, ఎస్సై జగన్మోహన్ రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించి కేసు నమోదు చేశారు.