తెలంగాణ

చెక్కు రూపంలోనే ఇక చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: కల్యాణ లక్ష్మి పథకం అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకం అమలు పలు ప్రాంతాల్లో దుర్వినియోగం కావడం ప్రభుత్వం దృష్టికి రావడంతో మార్పులు చేశారు. నగదు రూపంలో కాకుండా పెళ్లి కూతురు తల్లిపేరు మీద చెక్కు ఇస్తారు. స్థానిక ఎమ్మెల్యే ధ్రువీకరణ తప్పని సరి అనే నిబంధన చేర్చారు. లబ్ధిదారులను ఎంపిక చేసేది ఎమ్మెల్యేనే కాబట్టి ఎమ్మెల్యే ద్వారానే చెక్కు అందజేస్తారు. గతంలో పలు ప్రాంతాల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఇంతకు ముందే పెళ్లయిన జంటలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద పెళ్లి చేసుకున్నట్టు రికార్డులు చూపించి నిధులు స్వాహా చేశాయి. పాత నగరంలో ఇలాంటి బోగస్ పెళ్లిళ్లు చేయించే బ్రోకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పథకం అమలులో వస్తున్న పలు సమస్యలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశారు.

కార్పొరేట్ సంస్థలకు
అమ్ముడుపోయింది

తెరాస సర్కారుపై ఎబివిపి ధ్వజం

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయిందని ఎబివిపి నేతలు శుక్రవారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీ ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నా కెసిఆర్ సర్కారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప విమర్శించారు. రాష్ట్రంలో 150కి పైగా స్కూళ్లు లక్షలాది రూపాయల డొనేషన్లు వసూలుచేస్తున్నా తెరాస సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. విద్యను ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడంతో వాటి నిర్వాహకులు విద్యా రంగాన్ని వ్యాపార రంగంగా మార్చి లక్షల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. 40 వేల స్కూలు బస్సులకు ఎలాంటి అనుమతి లేకున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఇంటర్ విద్యాధికారులు కార్పొరేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై భారీగా ముడుపులు స్వీకరిస్తున్నారని అన్నారు. యాజమాన్యాలతో లాలూచీ పడి 10 వేల రూపాయిలు స్పెషల్ ఫీజుకు అనుమతివ్వడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఒక వైపు కరవు విలయం,ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల మోత మోగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దోపిడీకి నిరసనగా ఇప్పటికే పాఠశాలల ముందు, పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాలు చేశామని, 28న అన్ని డిఇఓ కార్యాలయాల ముందు కూడా ధర్నా నిర్వహిస్తామని అయ్యప్ప స్పష్టం చేశారు.