తెలంగాణ

సాగర్ కాల్వలో పడిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 24: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని నాయకన్‌గూడెం వద్ద ఎనె్నస్పీ ఇన్‌ఫ్లో కాల్వలో శుక్రవారం తెల్లవారుఝామున ఆర్టీసి బస్సు ప్రమాదవశాత్తు పడింది. హైదరాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న మణుగూరు డిపో డీలక్స్ బస్సు నాయకన్‌గూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి పాలేరు రిజర్వాయర్‌లోకి ఎనె్నస్పీ నీరు వచ్చే ఇన్‌ఫ్లో కాల్వలోకి పడిపోయింది. దాదాపు 20 అడుగుల లోతులో బస్సు పడిపోవటం, తెల్లవారుఝామున 3గంటల సమయం కావటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, ప్రయాణికులను పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భార్గవ్ (16నెలలు) మృతి చెందగా, భార్గవ్ తండ్రి కల్యాణ్ చక్రవర్తి, తల్లి శైలజకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఖమ్మం నగరంలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు మైలవరపు రాంబాబు, జడ్చర్లకు చెందిన శైలజ, నర్సింహ, కిష్టప్ప చిన్నప్ప, నాగోలు, ఖమ్మంకు చెందిన కృష్ణ, మధిరకు చెందిన చిలక ఉపేందర్, విష్ణువర్ధన్, హైదరాబాద్‌కు చెందిన నర్సింహ, కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన నగేశ్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాల్వలో పడిన బస్సు

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో
తెలంగాణకు ఉత్తమ అవార్డు

న్యూఢిల్లీ, జూన్ 24: పాస్‌పోర్టు వెరిఫికేషన్ సేవల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ పోలీసు శాఖకు ఉత్తమ అవార్డు లభించింది. జాతీయ పాస్‌పోర్టు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ, పాస్‌పోర్టు పత్రాల వెరిఫికేషన్ కోసం తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేకంగా ‘వెరీఫాస్ట్’ అనే యాప్‌ను ప్రవేశపెట్టడంతో కేవలం ఐదు రోజుల్లో ప్రకియ పూర్తవుతోందని తెలిపారు. ఈ ప్రకియను తొలిసారి తెలంగాణలో ప్రవేశపెట్టామని, సైబరాబాద్ ప్రాతంలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీన్ని తీసుకొచ్చి ఆ తర్వాత రాష్టమ్రంతా అమల్లోకి తీసుచ్చామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అలాగే పాస్‌పోర్టుల జారీలో ఉత్తమ సేవలు అందించిన హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి కూడా అవార్డు లభించింది. సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి కె.సుధాకర్ ఈ అవార్డును అందుకున్నారు.

శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సుషా మస్వరాజ్‌నుంచి
అవార్డు స్వీకరిస్తున్న తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ