తెలంగాణ

ఆన్‌లైన్‌లో డిగ్రీ సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: దేశంలో మొదటిసారి డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు నిర్వహించిన ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. తొలుత ఇది ఎంతో క్లిష్టమైనదని భావించిన ప్రభుత్వం తర్వాత సమస్యలను అధిగమిస్తూ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ఈ ఏడాదే సాకారం చేసింది. గత నెల రోజులుగా వివిధ దశలను అధిగమించిన ఆన్‌లైన్ అడ్మిషన్లకు అలాట్‌మెంట్ లేఖలు ఇచ్చారు. రాష్ట్రంలో 1103 కాలేజీల్లో 3,96,070 సీట్లు ఉండగా, 1,47,607 మందికి సీట్లను కేటాయించారు. ఇప్పటికే 1,10,128 మంది తమ అలాట్‌మెంట్ లేఖలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 30,620 మంది వివిధ కాలేజీల్లో రిపోర్టు చేశారు. కాకతీయ యూనివర్శిటీ పరిధిలో 305 కాలేజీల్లో 1,27,280 సీట్లు ఉండగా 38,220 సీట్లు కేటాయించారు. 27,278 మంది అభ్యర్ధులు తమ అలాట్‌మెంట్ లెటర్లను డౌన్‌లోడ్‌చేసుకున్నారు. 9046 మంది వివిధ కాలేజీల్లో రిపోర్టు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో 116 కాలేజీల్లో 40765 సీట్లు ఉండగా 13,244 మందికి సీట్లు కేటాయించారు. 9481 మంది తమ అలాట్‌మెంట్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకుని 2066 మంది రిపోర్టు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో 395 కాలేజీలు ఉండగా 1,20,885 సీట్లు ఉండగా 52,886 సీట్లు కేటాయించారు. 41,685 మంది తమ అలాట్‌మెంట్ ఆర్డర్లు డౌన్‌లోడ్ చేసుకోగా వారిలో 11,939 మంది రిపోర్టు చేశారు. పాలమూరు వర్శిటీ పరిధిలో 92 డిగ్రీ కాలేజీల్లో 28,680 సీట్లు ఉండగా 12911 మందికి సీట్లు కేటాయించారు. అందులో 9485 మంది తమ అలాట్‌మెంట్ లేఖలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 1451 మంది కాలేజీల్లో రిపోర్టు చేశారు, శాతవాహన వర్శిటీ పరిధిలో 125 కాలేజీల్లో 53,820 సీట్లు ఉండగా 18,390 మందికి సీట్లు కేటాయించారు. అందులో 13,668 మంది తమ అలాట్‌మెంట్ ఆర్డర్లను డౌన్‌లోడ్‌చేసుకుని 3978 మంది కాలేజీల్లో రిపోర్టు చేశారు. తెలంగాణ వర్శిటీ పరిధిలో 70 డిగ్రీ కాలేజీలు ఉండగా అందులో 26,640 సీట్లు ఉన్నాయి. అక్కడ 11,956 మందికి సీట్లు కేటాయించారు. 8531 మంది అలాట్‌మెంట్ ఆర్డర్లు డౌన్‌లోడ్ చేసుకుని 2140 మంది రిపోర్టు చేశారు. తొలి దశలో తమ వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారు మరోమారు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అంశంపై శనివారం నాడు నిర్ణయం తీసుకుంటామని కాలేజీయేట్ కమిషనరేట్ అధికారులు చెప్పారు.

ఒయు పిజి సెట్‌లో
61,732 మందికి అర్హత
90 కోర్సుల్లో 18798 సీట్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: ఉస్మానియా సహా నాలుగు విశ్వవిద్యాలయాల్లో పిజి అడ్మిషన్లకు నిర్వహించే ఒయు పిజిసెట్ ఫలితాలను శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, పాలమూరు వర్శిటీల్లోని 53 రకాల పిజి కోర్సుల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. 40 పిజి కోర్సులు, 10 పిజి డిప్లొమో కోర్సులు, మూడు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో పిజి సెట్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తారు. పిజి సెట్‌లో తొలిసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేశారు. ఇదే డాటాను ఇటు అడ్మిషన్లకు, అటు స్కాలర్‌షిప్‌లకు వినియోగిస్తామని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో 61,732 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 8 కోర్సులకు ఉన్న సీట్ల కంటే అభ్యర్ధులు తక్కువగా హాజరయ్యారు. చివరి వారంలో కౌనె్సలింగ్ ప్రారంభించి జూన్ 21 వరకూ ర్యాంకు కార్డులను అందజేస్తారు. వెబ్ ఆప్షన్లు జూలై రెండో వారంలో అందుబాటులోకి వస్తాయి. గత ఏడాది జరిగిన ప్రవేశపరీక్షలోని ప్రశ్నలనే మళ్లీ ఈ ఏడాది ప్రవేశపరీక్షలో ఇచ్చిన పేపర్ సెట్టర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రిజిస్ట్రార్ సురేష్‌కుమార్ చెప్పారు. అలాగే మాస్ కాపీయింగ్‌కు సంబంధించి కూడా ఇద్దరు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకుంటామని, ఇందుకు సిసి కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తామని అన్నారు.

ఎమ్సెట్ కౌనె్సలింగ్‌కు
16,585 మంది
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న కౌనె్సలింగ్‌కు శుక్రవారం 6674 మంది హజరయ్యారు. 1వ ర్యాంకు నుండి 16వేల ర్యాంకు వరకూ 9911 మంది, 16001 నుండి 26వేల ర్యాంకు వరకూ 6674 మంది హాజరయ్యారు. దీంతో ఇంత వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలనకు తొలి 26వేల ర్యాంకుల వరకూ 16,585 మంది హాజరయ్యారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు.
అభయ గోల్డ్ ఎండికి బెయిల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 24: ప్రజల వద్ద డిపాజిట్లు వసూలు చేసిన మోసం చేశారన్న అభియోగం ఎదుర్కొంటున్న కేసులో అభయ గోల్డ్ ఎండి కె శ్రీనివాసరావుకు హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ రాజా ఎలాంగో ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో జకీర్ హుస్సేన్, నాగరాజు, బి మియా, సాల్మన్ రాజు, పాల్సన్‌కు కూడా బెయిల్ లభించింది. తమకు కింది కోర్టు బెయిల్ తిరస్కరించిందని, బెయిల్ మంజూరు చేయాలని వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో బెయిల్ మంజూరైన నిందితులు రూ.50 వేల చొప్పున నగదును, ఇద్దరు పూచీకత్తును సమర్పించి విచారణ కోర్టు నుంచి బెయిల్ పొందాలని హైకోర్టు ఆదేశించింది.