తెలంగాణ

విద్యారంగాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోందని ఎబివిపి నేతలు శనివారం నాడు తీవ్రంగా విమర్శించారు. ప్రాధమిక విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతక విద్యారంగాల్లో సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుందని ఆరోపించారు. తాజాగా ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప సహా పలువురు నేతలు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందించారు. డిగ్రీ కాలేజీల్లో అదనపు ఫీజు ల వసూలు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్ధులు ట్యూషన్, ఇతరత్రా ఫీజులు కట్టాలని, కడితేనే అడ్మిషన్ ఇస్తామంటూ మానసికంగా విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్ధులను మినహాయించాల్సింది పోయి, ప్రతి విద్యార్ధి నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రెండు మూడు రెట్లు అత్యధికంగా వసూలుచేస్తున్నారని ఎబివిపి నేతలు వారికి వివరించారు.