తెలంగాణ

‘బ్రెగ్జిట్’వల్ల మనకు మేలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి అనుకూలంగా బ్రిటన్ ఓటు వేయడం (బ్రెగ్జిట్) ఐరోపా దేశాలతోపాటు అమెరికాలో జాతీయ వాదులు ఆదరణ పొందడం వంటి పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న అస్థిర పరిస్థితులు..్భరత్‌లో అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు దోహద పడతాయని, అయితే వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే మనదేశం ముందు తన ఇల్లు చక్కదిద్దుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రైతులకు ఆదాయాన్నిచ్చే ఏర్పాట్లతోపాటే వ్యవసాయేతర రంగాలలో పెద్దఎత్తున ఉద్యోగాలు, ముఖ్యమంత్రుల ప్రత్యక్ష ఎన్నిక, స్థానిక ప్రభుత్వాలకు నిధులు, అధికారాల వికేంద్రీకరణ వంటి సంస్కరణలకు దేశంలో అందరినీ సామరస్యతతో ఒకతాటిపై నిలపడానికి సిద్ధమైతే..బ్రెగ్జిట్ సహా ప్రపంచ పరిణామాలు మనకు అనుకూలంగా మారుతాయని జయప్రకాష్ నారాయణ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పునరుద్ఘాటించారు. జాతీయ స్థాయిలో రిఫరెండం వల్ల ఓటుకు-ఓటరు నిజమైన ప్రయోజనానికి సంబంధం మరుగునపడి తెలియనితనం, భావోద్రేకాలు, విద్వేషాలు ప్రభావం చూపే అవకాశముందని జెపి అన్నారు. వలసలు, వాణిజ్యానికి అడ్డుకట్ట వేయడం వల్ల అందరూ నష్టపోతారని, ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు.