తెలంగాణ

ధాన్యం సేకరిస్తున్నారు, డబ్బులు ఇవ్వడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్నా వారికి డబ్బులు మాత్రం వెంటనే చెల్లించడం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రబీలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే రైతులకు డబ్బు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రబీ సీజన్‌లోధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లకు మధ్య దళారీల దోపిడీని అరికడతామని ప్రకటించి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 3500 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించిందని, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులు అకౌంట్లలోకి డబ్బులు వేస్తామని పేర్కొన్నారని కానీ అలా జరగలేదని అన్నారు. నేటికీ 3.50 లక్షల మంది రైతులకు 2500 కోట్ల రూపాయిలు చెల్లించకపోవడం దారుణమని అన్నార్ఘు. రైతులు బ్యాంకులు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమై విత్తనాలు సాగు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారని, దీనికి తోడు ఈ నెలలో స్కూళ్లు ప్రారంభం కావడంతో రైతులు ఫీజులకు డబ్బులు దొరక్క అవస్థలు పడుతున్నారని అన్నారు.
వేడుకగా రాజ్‌బహదూర్
శతజయంతి: చాడ వెంకటరెడ్డి
రాజ్‌బహుదూర్ గౌర్ శతజయంతిని జూలై 25న వేడుకగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చాడ మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశ పాలన కూలద్రోసిన తర్వాత డాక్టర్ రాజ్ బహుదూర్ గౌర్ కార్మికులను ఐక్యం చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అగ్రభాగాన నిలిచారని అన్నారు.
అలాంటి నేతల స్ఫూర్తితో కార్మిక నాయకులను తయారుచేసుకోవల్సి ఉందని ఆయన చెప్పారు. జూలై 25న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. ఆయన విగ్రహాన్ని హిమాయత్ నగర్‌లోని కూడలిలో ప్రతిష్టించడానికి ప్రభుత్వం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో పి వెంకటరెడ్డి, అజీజ్ పాషా, రత్నాకర్, డాక్టర్ సుధాకర్, ఈటీ నర్సింహ, సత్యనారాయణ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి