తెలంగాణ

పోలీసుల అదుపులో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 11 :ముంపు గ్రామాల బాధితులకు అందచేసే పరిహారం చెక్కులు మాయం కేసు సంచలనం కలిగిస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 టీఎంసీల కొమురవెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ముంపు గ్రామాల బాధితులకు అందచేసే 3.10 కోట్ల విలువచేసే పరిహార చెక్కులు మాయమవ్వటంతో సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల అదుపులో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. మల్లన్నసాగర్ పరిహార చెక్కుల మాయఘటనపై ఆర్డీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్, సీసీ సందీప్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా జిల్లా కేంద్రం నుండి వెళ్లవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిద్దిపేట పోలీసు అధికారులు ఆర్డీఓ జూనియర్ అసిస్టెంట్ సందీప్‌తో పాటు, మరో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. చెక్కుల మాయంపై వెనుక జిల్లాలోని మండలాల తహశీల్దార్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పోలీసులు పూర్తి స్థాయిలోనే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కోమురవెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా సుమారు 8 గ్రామాలకు నిర్వాసితులుగా మారనున్నారు. తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు ముందు బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ పునరావసం, పునర్ నిర్మాణంలో భాగింగా ముంపు బాధితులకు అందరికీ పరిహార చెక్కులను అందచేశారు. తెలంగాణ సర్కార్ బాధితులకు పరిహార ప్రక్రియ వేగవంతంగా చేయాలని ఆదేశించటంతో రెవెన్యూ అధికారులు అదనుగా భావించి పరిహారాన్ని పక్కదోవ పట్టించేందుకు అక్రమాలకు తెరలేపారు.
పరిహారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు పరిహార ప్రక్రియ వేగవంతం చేసింది. ముంపు బాధితులకు అందచేసే రెండు పరిహార చెక్కులు ఒకటి 50,37 లక్షలు, మరోటి 2.61 కోట్ల రూపాయల చెక్కులు మాయం చేశారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా తతంగం జరిగింది. దీంతో ఆర్డీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్, సీసీఎ. సందీప్ కేసుల మాయం ఘటనలో సంబంధం ఉన్నట్టు అధికారుల విచారణలో తేల్చారు. ఈవిషయం వెలుగుచూడటంతో ఈనెల 10 సోమవారం రాత్రి ఆర్డీఓ కార్యాలయం సీసీ సందీప్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామానికి చెందిన చాంద్‌పాషా ఒక చెక్కుద్వారా 50,37,500 లక్షల రూపాయలను జనవరి మాసంలో డ్రా చేశాడు. మరో చెక్కు 2.60 కోట్లకు పైగా ఉన్న చెక్కును ఏప్రిల్ మాసంలో డ్రా చేసేందుకు యత్నించారు. బ్యాంకులో అంత మేర డబ్బులు లేకపోవటంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొమురవెల్లి మల్లన్న సాగర్ పరిహారం చెక్కుల మాయమైన ఘటన ఈనెల జనవరి మాసంలో చోటుచేసుకోగా ఆలస్యంగా జూన్ నెల మొదటి వారంలో అధికారుల దృష్టికి వచ్చింది. ఈవిషయంపై ఈనెల 7న సిద్దిపేట వన్‌టౌన్‌లో చాంద్‌పాషాపై కేసు నమోదు చేశారు. ఈఘటనకు బాధ్యులుగా భావిస్తున్న చాంద్‌పాషా పరారిలో ఉన్నట్టు సమాచారం. చాంద్‌పాషా కుటుంబ సభ్యులను నుండి జిల్లా అధికారులు 50 లక్షల రూపాయలు రికవరీ చేసినట్టు చెపుతున్నారు.