తెలంగాణ

దాసరిపల్లి గుట్టలో చిరుత సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసాపేట, జూన్ 12: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలో చిరుతపులి సంచరి స్తోంది. దాసరిపల్లి గ్రామంలో మం గళవారం అర్ధరాత్రి గ్రామంలో వెంకటయ్యకు చెందిన లేగదూడను చిరుత పులి చంపి తింది. బుధవారం ఈ విషయం గుర్తించిన వెంకటయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు చిరుత పులి పాదాలను గుర్తించారు. త్వరలోనే పులిని పట్టుకుంటామని అన్నారు. గత కొన్నిరోజులుగా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో మూడు మేకలను ఎతుకెళ్లిన చిరుత అలాగే తుంకినిపూర్ గ్రామంలో ఒక ఆవు, మేకను సైతం ఎత్తుకెళ్లి చంపితిన్న ఆనవాళ్లను గుర్తించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ గ్రామంలోకి వస్తుందో ఎవరిపైన చిరుత దాడి చేస్తుందో అని యా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. త్వరగా చిరుతను పట్టుకోవాలని వారు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
చిత్రం...పులి చంపిన లేగదూడను చూపుతున్న రైతు