తెలంగాణ

హుజూర్‌నగర్ వెనుకబాటుకు ఉత్తమ్ నిర్లక్ష్యమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జూన్ 12: గత ఐదు సంవత్సరాలుగా హుజూర్‌నగర్ నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడం వలనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో సింగిల్‌విండో ఛైర్మన్ చలసాని శ్రీనివాస్‌రావు తండ్రి చలసాని అప్పారావు ఇటీవల మృతిచెందగా ఆయన పరామర్శించారు. నేరేడుచర్ల మండలంలో పలు రహదారుల దుస్థితిపై విలేఖరులు ఆయన దృష్టికితేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే పనులు జరగలేదని, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రస్తుతం శాసనసభ్యుడు లేనందున నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తాళ్లూరి లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు దొండపాటి అప్పిరెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సుంకరి క్రాంతికుమార్, చింతమళ్ల సైదులు, సోమిరెడ్డి, వల్లంశెట్ల కృష్ణయ్య, చలసాని మాధవరావు, శ్రీరాంరెడ్డి, కరణం నర్సయ్య పాల్గొన్నారు.

చిత్రం... చలసాని శ్రీనివాస్‌రావును పరామర్శిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి