తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల కోసం కార్మికుల ఓటర్ లిస్టు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించడానికి కార్మిక శాఖ సన్నాహాలు చేపట్టిందని సంబంధింత శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో జాయింట్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ పదవీ కాలం 2018 ఆగస్టు 7వ తేదీ నాటికి ముగిసిందన్నారు. గతంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక యూనియన్ల నేతలు ఇప్పటికే వినతిప్రతాలు అందజేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీలో దాదాపు 52 వేల మంది ఉద్యోగ, కార్మికులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆర్టీసీలో ప్రస్తుతం 12 యూనియన్లు పని చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులకు సంబంధించిన ఓటర్ లిస్టులను 15 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు కార్మిక యూనియన్లకు తమ వద్ద ఉన్న కార్మికుల ఓటర్ లిస్టులను అందజేయాలని ఆదేశించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వారీగా ఓటర్ల లిస్టులు కార్మిక శాఖకు ఇవ్వాలని ఆదేశించామన్నారు. జూలై రెండోవారంలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించడానికి త్వరలో ఆర్టీసీ యాజమాన్యంతో పాటు కార్మిక యూనియన్ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ తెలిపారు.