తెలంగాణ

విద్యా వ్యవస్థ నాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయని, తెలంగాణ ఏర్పడి ఐదేళ్లు గడిచినా, విద్యావ్యవస్థ మొత్తం కుప్పకూలిందని, నిర్వీర్యం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సందర్భంగా కార్పొరేట్ విద్యకు స్వస్తిపలికి కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని చెప్పారని, కేసీఆర్ మనుమడు, డ్రైవర్ కొడుకు ఒకే విద్య అందేలా చేస్తామని హామీ ఇచ్చారని , పేదవారికి కూడా నాణ్యమైన విద్యను కల్పిస్తామని ప్రగల్బాలు పలికారని నేటికీ అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. అదనంగా అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని, తెలంగాణను నెంబర్ వన్ చేస్తామని చెప్పారని, కానీ నేడు అవినీతిలో నెంబర్ వన్ అయిందని, కుటుంబ పాలనలో నెంబర్ వన్ అయిందని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో నెంబర్ వన్‌గా ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఐదేళ్లకాలంలో సీఎం అప్పుచేసి పప్పుకూడు అనే రీతిలో 1.20లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఆర్ధికంగా సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కొత్త రేషన్ కార్డులు లేవని, కొత్తగా పెన్షన్లు ఇచ్చింది లేదని అన్నారు. ప్రభుత్వ టీచర్లకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేదని, గాలిలో దీపం పెట్టి దిశా దశ లేకుండా నడుస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పైచిలుకు విద్యార్థులు పాఠశాలల్లో చదువుతుంటే ఫీజుల నియంత్రణ ఏమాత్రం లేదని అన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మిగిలిన కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా వెలాసిటీ వంటి సంస్థలను నెలకోల్పారని, పేదవాడికి విద్య అందుబాటులోని పరిస్థితిని తెచ్చిందని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని చెప్పారు. ఫీజులను ప్రతి ఏటా 20 నుండి 30 శాతం పెంచుకుంటూ పోతున్నారని, ఫీజు రెగ్యులేటరీ కమిటీని నియమించమని చెప్పినా, మొక్కుబడిగా ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేసి చేతులు దులుకుందని అన్నారు. ఇంత వరకూ ఆ నివేదిక బహిర్గత పరచకుండా ఎవరికి కొమ్ముకాయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని నిలదీశారు. ఫీజులను నియంత్రించమంటే సాధ్యం కాదని ఈ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. భారతదేశంలోనే అత్యధిక ఫీజులున్న నగరం హైదరాబాద్‌గా మారిందని , దీనికి కారణం ప్రభుత్వ కట్టడి లేకపోవడమేనని ఆరోపించారు. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు వేలల్లో , లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.
తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ప్రజాపోరాటాల ద్వారా భర్తీ చేస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులు ఆసరాగా చేసుకుని టీఆర్‌ఎస్ తప్పులు చేయడం సరికాదని మండిపడ్డారు. దక్షిణాదిలో కర్నాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనేనని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కుటుంబ పాలనపై పోరాటాలు, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఎపుడో కనుమరుగయ్యాయని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యతను ఆసరగా చేసుకుని ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నివేదిక ఇస్తామని అన్నారు. అధికార పార్టీతో పొత్తులో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని అన్నారు.