తెలంగాణ

నూతన జాతీయ విద్యా విధానంలో సమ్మిళిత విద్యకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులను సూచిస్తూ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ సూచించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో దివ్యాంగ విద్యార్ధుల సమ్మిళిత విద్యకు అన్యాయం జరిగింది. రాజ్యాంగం అమలులోకి విచ్చిన తర్వాత 1960 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల అభివృద్ధి, వారి సంక్షేమం, విద్యకు ఇంకా ఎంతో చేయాల్సిన తరుణంలో రూపొందిస్తున్న జాతీయ విద్యా విధానంలో సైతం సమ్మిళిత విద్యకు తగిన ప్రాధాన్యత లభించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా దివ్యాంగులకు సహిత విద్యను పర్యవేక్షించే ఏ వ్యవస్థ లేనేలేదు. ప్రతి రాష్ట్రంలో దివ్యాంగులకు సహిత విద్యను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి ఉంది. వ్యవస్థలో లోపాలతో విద్యా హక్కు చట్టం అమలులో ఉన్నా దాని ఫలాలు అందకుండానే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు సుదూరంగా ఉండిపోతున్నారు. ఉచిత నిర్బంధ విద్యను సామాన్య విద్యార్ధులపై అమలుచేస్తున్న రీతిలో దివ్యాంగ విద్యార్థులను పట్టించుకునేందుకు అనుగుణమైన చట్ట నిబంధనలు లోపించాయని విద్యా నిపుణలు పేర్కొంటున్నారు. దివ్యాంగుల అంశం సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ, మానవ వనరుల శాఖల మధ్య నలిగిపోతోంది. రెండు శాఖల మధ్య సరైన సమన్వయం లేక విద్యాపరమైన అభివృద్ధి రోజురోజుకూ దిగజారుతోంది. 2011 జనాభా లెక్కలు ప్రకారం 19 సంవత్సరాల లోపు దివ్యాంగులు 76.64 లక్షలు ఉండగా, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు 24.66 లక్షలు. 2016-17 లెక్కల ప్రకారం ఆ సంఖ్య 22.42 లక్షలు కాగా, 2017-18 లెక్కల ప్రకారం 19.98 లక్షలు, యునిసెఫ్ లెక్కల ప్రకారం భారత్‌లో వైకల్యంతో ఉన్న వారు 30 మిలియన్ల పిల్లలని తేల్చింది. ఇలా గణాంకాల మధ్య గందరగోళం ఉన్నా ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడంతో వాస్తవిక లక్ష్యాలతో పనిచేయకలేపోతోంది. జాతీయ నూతన విద్యా విధానం -2019లో కూడా దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను విస్మరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అధ్యాయం 3 ప్రకారం దివ్యాంకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చి సహిత విద్యను అందించాల్సి ఉంది. వివక్ష లేకుండా అన్ని స్కూళ్లలో దివ్యాంగులకు ప్రవేశాలను కల్పించడం, క్యాంపస్‌లు అందుబాటులో ఉంచడం, తగిన వసతి కల్పించడం వంటి అనేక నిబంధనలున్నాయి. స్థానిక అధికారులు తీసుకోవల్సిన చర్యలపై సెక్షన్ 17 సమగ్రంగా వివరిస్తోంది. వీటన్నింటినీ ప్రభుత్వాలూ, అధికారులూ చెత్తబుట్టలో వేయడంతో సహిత విద్య కాగితాలకే పరిమితమైంది. కనీసం ఇప్పటికైనా ప్రత్యేక అవసరాలున్న పిల్లల సహిత విద్యను నిర్వచాంచాలని స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫోరం జాతీయ కన్వీనర్ కల్పగిరి శ్రీను కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యకు ప్రత్యేక విభాగం నెలకోల్పాలని ఆయన సూచించారు. వికలాంగుల హక్కుల చట్టంలోని నిబంధనలను విద్యా హక్కు చట్టంలో కూడా చేర్చాలని, ప్రత్యేక విద్యలో శిక్షణకు తగినంత ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణా సంస్థలను నెలకోల్పాలని అన్నారు. దేశవ్యాప్తంగా దివ్యాంగుల సహిత విద్యపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని ఆయన సూచించారు.